వాయిదా దిశగా `ఏజెంట్`?
on Aug 4, 2021
స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అక్కినేని బుల్లోడు అఖిల్.. `ఏజెంట్` పేరుతో ఓ స్పై డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి వైద్య కథానాయికగా పరిచయమవుతున్న ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్స్ మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే యూనిట్ ప్రకటించింది. అయితే, అదే సీజన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప` సినిమా తాలూకు ఫస్ట్ పార్ట్ `పుష్ప - ద రైజ్` విడుదల కానున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో.. `ఏజెంట్`ని వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే దిశగా టీమ్ ప్లాన్ చేస్తోందట. మరి.. `ఏజెంట్` వాయిదా పడనుందంటూ వస్తున్న కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`ఏజెంట్`కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తుండగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
కాగా, అఖిల్ నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విడుదలకు సిద్ధమైంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ సినిమాని `బొమ్మరిల్లు` భాస్కర్ డైరెక్ట్ చేశాడు.
Also Read