మెగాస్టార్ బర్త్ డే స్పెషల్: `ఆచార్య` సర్ప్రైజ్!
on Aug 3, 2021
`ఖైదీ నంబర్ 150`(2017)తో గ్రాండ్ రి-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆపై `సైరా.. నరసింహారెడ్డి` (2019)తో పలకరించారు. ఈ రెండు సినిమాలతోనూ వసూళ్ళ పరంగా సంచలనం సృష్టించారు. త్వరలో ఈ సీనియర్ స్టార్ `ఆచార్య`గా రాబోతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో చిరుతో పాటు ఆయన తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. చిరు పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 22న అభిమానులకు ఓ సర్ ప్రైజ్ వీడియో ప్లాన్ చేసిందట `ఆచార్య` యూనిట్. ఇందులో చిరు, చరణ్ కాంబో సీన్స్ కి సంబంధించిన ఓ గ్లింప్స్ కూడా ఉంటుందని టాక్. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `ఆచార్య`లో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read