ఓటీటీలో విజయ్ సేతుపతి, తాప్సీ చిత్రం
on Jul 26, 2021
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటీనటుల్లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని, టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సేతుపతి చేతిలో వేర్వేరు భాషలకు చెందిన 16 చిత్రాలుండగా.. తాప్సీ కూడా వేర్వేరు భాషల్లో 9 సినిమాలు చేస్తోంది. వీటిలో కొన్ని విడుదలకు సిద్ధమవగా.. మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. అలాంటి ఈ ఇద్దరు బిజీ ఆర్టిస్టులు.. ఓ కోలీవుడ్ మూవీ కోసం కలిసి పనిచేశారు. పేరు నిర్ణయించని ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ కూడా పూర్తిచేసుకుంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ వేదికలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. సీనియర్ దర్శకుడు సుందర రాజన్ తనయుడు దీపక్ సుందరరాజన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. ఫ్యాషన్ స్టూడియో సంస్థ నిర్మించింది. కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ ముగిశాక.. సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాని పూర్తిచేశారు. అలాగే, సెకండ్ వేవ్ లాక్ డౌన్ లో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేశారు. కాగా, ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా థియేటర్స్ లో కంటే ఓటీటీ రిలీజ్ కే మేకర్స్ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని కూడా అలాగే రిలీజ్ చేయబోతున్నారని కోలీవుడ్ బజ్. త్వరలోనే విజయ్ సేతుపతి, తాప్సీ కాంబో మూవీ టైటిల్, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వస్తుంది.