ఉప్పెన.. రిలీజ్ డేట్ అదేనా?
on Jan 13, 2021

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మించిన చిత్రం ఉప్పెన. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాతో కృతి శెట్టి కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తొలిసారి మెగాఫోన్ పట్టి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు.
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 2నే విడుదల కావాల్సిన ఉప్పెన కోవిడ్ కారణంగా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 5న ఉప్పెనని జనం ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది. మరి.. డెబ్యూ మూవీతో వైష్ణవ్ తేజ్ ఎలాంటి గుర్తింపుని తెచ్చుకుంటాడో చూడాలి.
కాగా, వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందించిన నవలాధారిత చిత్రం కొండపొలంలోనూ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నాయిక. ఓటీటీలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశముందంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



