వార్ 2 క్లైమాక్స్ లో రెండు క్రెడిట్ సీన్స్! మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు
on Jul 28, 2025

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)అప్ కమింగ్ మూవీ 'వార్ 2'(War 2). యాక్షన్ థ్రిల్లర్ గా అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ మూవీతో, ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ లో అడుగుపెడుతుండటం, స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో, 'వార్ 2 ' ఇండియాలోనే అతి పెద్ద మల్టిస్టారర్ గా గుర్తింపు పొందింది. ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా విడుదలకి సిద్ధమవుతుండగా, రోజుకొక కొత్త అప్ డేట్ 'వార్ 2 'పై ఉన్న అంచనాలని రెట్టింపు చేస్తుంది.
'వార్ 2 ' ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'యష్ రాజ్ ఫిల్మ్స్'(Yash Raj Films)నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి వచ్చిన ప్రీవియస్ చిత్రాలు పఠాన్, టైగర్ 3 . షారుక్ ఖాన్(Shah Rukh Khan),సల్మాన్ ఖాన్(Salman Khan)నటించిన ఆ రెండు చిత్రాల్లోని క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రేక్షకులని సరికొత్త థ్రిల్ కి గురి చేసాయి. తమ సంస్థ నుంచి రాబోయే కొత్త చిత్రాలకి సంబంధించిన హీరో క్యారక్టర్ ని ఆయా చిత్రాల కథకి లింక్ చేసిన విధానం అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కోవలోనే 'వార్ 2 ' క్లైమాక్స్ లో 'పఠాన్ పార్ట్ 2 'తో పాటు,యష్ రాజ్ నుంచి రాబోయే ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ స్పై యాక్షన్ 'ఆల్ఫా' మూవీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నట్టుగా బాలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.' వార్ 2 ' తో ఎన్టీఆర్ బాలీవుడ్ లో తన సత్తా చాటతాడనే నమ్మకం కూడా ఫ్యాన్స్ లో ఉంది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్న 'వార్ 2 ' లో ఎన్టీఆర్ ఇంటిలిజెన్స్ వర్గాల్లో అత్యున్నత పోస్ట్ గా పరిగణించే 'రా' ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani)
కీలక పాత్ర పోషించగా, అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)దర్శకుడిగా వ్యవహరించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



