సునీల్ తో త్రివిక్రమ్ సినిమా?
on Jun 24, 2015
.jpg)
వెండి తెర ముందు ఇతను ఓ హీరో కావచ్చు..అతను ఓ స్టార్ డైరెక్టర్ కావచ్చు. కానీ తెరవెనుక ఇద్దరూ ప్రాణ స్నేహితులే.. ఆ స్టార్ డైరెక్టర్ రచయితగా పనిచేసినప్పుడు, తన స్నేహితుడి కోసం ఎన్నో పాత్రలను సృష్టించాడు. వారేవరో కాదు మన సునీల్-త్రివిక్రమ్ లు. తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో వీరిద్దరి పేరు ఎప్పటికి వుంటుంది. గత కొంతకాలంగా త్రివిక్రమ్ చాలా బిజీగా వుండడంతో..సునీల్ తో సినిమా చేసే అవకాశం ఇంత వరకు కుదరలేదు.
లేటెస్ట్ గా టాలీవుడ్ టాప్ హీరోల౦తా తమ ప్రాజెక్ట్ లతో బిజీగా వుండడంతో త్రివిక్రమ్ సడన్ గా ఖాళీ అయ్యాడు. దీంతో ఈ గ్యాప్ లో తన స్నేహితుడు సునీల్ తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట. దాని కోసం ఆయన దగ్గర ఎప్పటి నుంచో ఓ కథ వుందట. ఇప్పుడు ఆ కథతో సునీల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. సునీల్ కూడా ఈ ప్రాజెక్ట్ తో తాను మళ్ళీ ట్రాక్ లోకి రావచ్చనే ఆలోచనలో వున్నాడట.ఇదే నిజమైతే టాలీవుడ్ అభిమానులకి త్వరలో నవ్వుల పండుగ ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



