ఫ్యామిలీ మ్యాన్ 2 సంచలనం.. వరల్డ్ వైడ్ గా నాలుగో స్థానం
on Jun 23, 2021
'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ కు ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ లభించిందో తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్-2'కు మొదటి సీజన్ ని మించిన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'ది ఫ్యామిలీ మ్యాన్-2' మరో సంచలనం సృష్టించింది. వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్ టీవీ షోస్ లో ఒకటిగా నిలిచింది.
ఐఎండీబీ లిస్టులో వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్ టీవీ షోస్ లో 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని శ్రీధర్ పిళ్ళై ట్విట్టర్ వేదికగా తెలిపారు. వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్ టీవీ షోస్ లో మొదటి మూడు స్థానాల్లో.. 'లోకి', 'స్వీట్ టూత్', 'మేర్ ఆఫ్ ఈస్ట్ టౌన్' నిలవగా.. నాలుగో స్థానంలో 'ది ఫ్యామిలీ మ్యాన్-2' నిలిచింది.
రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై ఆకట్టుకుంది. ఈ సిరీస్ లో సమంత, మనోజ్ బాజ్ పాయ్ ల నటనకు ప్రశంసల వర్షం కురిసింది. ముఖ్యంగా సమంత ఈ సిరీస్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది.