చైతన్య 'థాంక్యూ' రిలీజ్ డేట్ మారింది
on Jun 24, 2022
ఈ మధ్య కాలంలో సినిమాల విడుదల తేదీలు తెగ మారిపోతున్నాయి. తాజాగా 'థాంక్యూ' సినిమా విడుదల తేదీ కూడా మారిపోయింది. జూలై 8న విడుదల కావాల్సిన ఈ మూవీ రెండు వారాలు ఆలస్యంగా రానుంది.
'మనం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని యువ హీరో నాగ చైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'థాంక్యూ'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్స్. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని జూలై 8న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా మరో కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడు.
Also Read