దీపావళి బరిలో `శ్యామ్ సింగ రాయ్`!
on Sep 15, 2021
ఈ వినాయక చవితికి `టక్ జగదీష్`గా పలకరించాడు నేచురల్ స్టార్ నాని. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. నానికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కట్ చేస్తే.. తన కొత్త చిత్రానికి కూడా ఫెస్టివల్ సీజన్ నే టార్గెట్ చేసుకున్నాడట ఈ టాలెంటెడ్ హీరో. అయితే `వి`, `టక్ జగదీష్` తరహాలో ఓటీటీలో కాకుండా.. తను ఎంతగానో ఇష్టపడే `థియేట్రికల్ రిలీజ్` మెథడ్ లోనే ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఎంసీఏ` వంటి విజయవంతమైన చిత్రం తరువాత డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవితో నాని జోడీకట్టిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన ఈ పిరియడ్ డ్రామాలో బెంగాలీ బాబుగా సందడి చేయనున్నాడు నాని. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. దీపావళి కానుకగా నవంబర్ తొలి వారంలో రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `శ్యామ్ సింగ రాయ్`లో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి, `ప్రేమమ్` ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ కూడా నాయికలుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి స్వరకర్త.
Also Read