భన్సాలీని భయపెడుతోన్న కింగ్ ఖాన్
on Jun 23, 2015
.jpg)
షారుక్ ఖాన్ తో పోటీపడలేనని డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తేల్చిచెప్పాడట. అదేంటి హీరోకి-దర్శకుడికి మధ్య పోటీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? విషయం ఏంటంటే...రామ్ లీలా తర్వాత రణవీర్ సింగ్-దీపిక పదుకొనె తో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం బాజీరావ్ మస్తానీ. ఈమూవీపై బీటౌన్లో బారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమాని డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. కానీ అదే సమయంలో షారుఖ్- కాజోల్ జంటగా నటిస్తున్న చిత్రం దిల్ వాలే వస్తుండడంతో భన్సాలీ వెనకడుగేశాడట. క్రిస్మస్ కానుకగా దిల్ వాలే విడుదలవుతుండడంతో....తన చిత్రాన్ని న్యూ ఇయర్ కు షిప్ట్ చేశాడట.
మరీ అంత భయమా అంటే...గతంలో షారుక్ ఓం శాంత ఓం కి పోటీగా సావరియా విడుదల చేసి దెబ్బతిన్నాడు. అదే కాదు షారుక్ తో పోటీపడిన ప్రతిసారీ భన్సాలీ ఓడిపోతున్నాడట. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పిలే అని ఫీలై....తన సినిమానే వాయిదా వేసుకున్నాడట. మరి ఈ దర్శకుడి స్ట్రాటజీ ఏ మేరకు సక్సెస్ ఇస్తుందో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



