చుల్ బుల్ పాండే మళ్ళీ వస్తున్నాడు!
on Jul 26, 2021
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చిన పాత్రల్లో పోలీస్ అధికారి చుల్ బుల్ పాండే ఒకటి. `దబాంగ్` సిరీస్ కోసం చుల్ బుల్ పాండేగా సల్మాన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా.. ఈ సిరీస్ లో మొదటి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. మూడో భాగం ఆశించిన విజయం సాధించనప్పటికీ.. ఈ సిరీస్ పై జనాల్లో ఇంకా ఆసక్తి ఉంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. త్వరలోనే `దబాంగ్` సిరీస్ లో నాలుగో సినిమా రాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని టాక్. గత మూడు చిత్రాల కంటే భిన్నంగా, మరింత ఎంటర్టైనింగ్ గా చుల్ బుల్ పాండే పాత్రని డిజైన్ చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గా ఓ టాక్ షోలో `దబాంగ్ 4` చేయబోతున్నట్లు సల్మాన్ మాటలను బట్టి స్పష్టమైన నేపథ్యంలో.. అతని అభిమానులు మరోసారి చుల్ బుల్ పాండే అందించే వినోదం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహుశా.. 2022లో `దబాంగ్ 4` సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సల్మాన్ చేతిలో `టైగర్ 3`, `అంతిమ్` చిత్రాలున్నాయి. అలాగే, `లాల్ సింగ్ చద్ధా`, `పఠాన్` సినిమాల్లో అతిథిగా దర్శనమివ్వనున్నాడు.