`టక్ జగదీష్`లో రీతూ వర్మ క్యారెక్టర్ డిటైల్స్
on Feb 26, 2021
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన చిత్రం `టక్ జగదీష్`. `నిన్ను కోరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో నాని చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో నానికి అన్నగా జగపతిబాబు నటించగా.. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ నాయికలుగా నటించారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రీతూ వర్మ పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (వీఏఓ) రోల్ లో దర్శనమివ్వనుందట రీతూ. అంతేకాదు.. సినిమాలో దాదాపుగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుందట. `పెళ్ళి చూపులు` తరువాత రీతూకి ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చే ఇదే అవుతుందని అంటున్నారు.
మరి.. `టక్ జగదీష్`తో రీతూ వర్మ ఖాతాలో మరో విజయం చేరుతుందేమో చూడాలి. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించిన `టక్ జగదీష్` వేసవి కానుకగా ఏప్రిల్ 23న థియేటర్స్ లో సందడి చేయనుంది. నాని బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
Also Read