కోస్తా కుర్రాడిగా రామ్!
on Sep 15, 2021
`ఇస్మార్ట్ శంకర్`లో నైజాం పోరడుగా ఎంటర్టైన్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పేరు నిర్ణయించని బైలింగ్వల్ మూవీలో రాయలసీమ యువకుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. కట్ చేస్తే.. నెక్స్ట్ వెంచర్ లో కోస్తా కుర్రాడిగా పలకరించబోతున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రామ్ హీరోగా ఓ సినిమా రాబోతున్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. రైట్ నౌ విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3` చేస్తున్న అనిల్.. ఆపై నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ మూవీ చేయబోతున్నాడు. అదయ్యేలోపే రామ్ తో ఓ మాస్ ఎంటర్టైనర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడట అనిల్. అంతేకాదు.. ఇందులో రామ్ ఓ కోస్తా కుర్రాడిగా కనిపిస్తాడని, తన మార్క్ వినోదాన్ని జోడించి ఈ క్యారెక్టర్ ని అనిల్ భలే ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేస్తున్నాడని వినికిడి. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, గతంలో రామ్ హీరోగా నటించిన `కందిరీగ`, `మసాలా`, `పండగ చేస్కో` చిత్రాలకు రచయితగా పనిచేశాడు అనిల్ రావిపూడి. వీటిలో `కందిరీగ` మంచి విజయాన్ని అందుకుంది.
Also Read