ఆగష్టు 1న 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ సాంగ్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో క్లారిటీ వచ్చింది
on Jul 27, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుండి వచ్చే ఒక్కో అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి 'దోస్త్' అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ని ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకుని ఆగష్టు 1 ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ స్పెషల్ సాంగ్ షూట్ లో ఈ మూవీ ప్రధాన తారాగణం పాల్గొనగా.. హైదరాబాద్లో వేసిన భారీ సెట్ లో రీసెంట్ గానే చిత్రీకరించారని సమాచారం. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్ (హేమచంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ యేసుదాస్, యాజిన్ నజీర్) ఆలపించారు. ఇటీవల ఈ సాంగ్ కి అనిరుధ్ మ్యూజిక్ అందించారని ప్రచారం జరిగింది. అయితే మూవీ టీమ్ తాజా ప్రకటనతో కీరవాణినే మ్యూజిక్ అందించారని క్లారిటీ వచ్చింది.
'ఆర్ఆర్ఆర్' లో తారక్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్, చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొమురం భీమ్ పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.