'ఆర్ఆర్ఆర్' ఫీవర్.. 'భీమ్' రూపంలో వినాయకుడు!
on Aug 2, 2022
'ఆర్ఆర్ఆర్' సినిమా అంతా ఒకెత్తయితే అందులో ఇంటర్వెల్ సీన్ మరో ఎత్తు. ఇంటర్వెల్ కి ముందు 'భీమ్' పాత్రధారి జూనియర్ ఎన్టీఆర్ ట్రక్ లో జంతువులను తీసుకెళ్లి బ్రిటిష్ కోటపై దాడి చేసే సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా చేతుల్లో కాగడాలు పట్టుకొని జంతులతో పాటు ట్రక్ లో నుంచి భీమ్ దూకే షాట్ కి హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఆ షాట్ ట్విట్టర్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో రికార్డు సృష్టించింది. అయితే ఈ షాట్ ఫీవర్ ఇండియాలోనూ ఓ రేంజ్ లో కనిపిస్తోంది. ఈ వినాయక చవితికి గణేష్ ని 'భీమ్' రూపంలో తయారు చేస్తున్నారు కొందరు క్రియేటర్స్.
వినాయక చవితి వస్తుందంటే చాలు గణేష్ ని రకరకాల రూపాల్లో తయారు చేస్తుంటారు. సినిమాల్లో బాగా ఫేమస్ అయిన పాత్రల రూపాలలో కూడా తయారు చేస్తారు. గతంలో 'బాహుబలి' వినాయకుడు, 'జనతా గ్యారేజ్' గణేశుడుని చూశాం. అప్పట్లో పర్యావరణ రక్షణ కాన్సెప్ట్ తో రూపొందించిన 'జనతా గ్యారేజ్' గణేష్ ఆకట్టుకున్నాడు. అయితే ఈ ఏడాది వినాయక చవితికి గణేష్ ని భీమ్ గా ముస్తాబు చేస్తున్నారు.
వినాయక చవితి(ఆగస్టు 31)కి ఇంకా నాలుగు వారాలే ఉండటంతో వినాయక విగ్రహాల తయారీ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ క్రమంలో భీమ్ రూపంలో ఉన్న గణేష్ విగ్రహాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చేతుల్లో కాగడాలు పట్టుకొని జంతులతో పాటు ట్రక్ లో నుంచి భీమ్ దూకే షాట్ ని తలపించేలా ఉన్న ఆ విగ్రహం ఆకట్టుకుంటోంది. ఇంకా ఆ విగ్రహానికి రంగులు వేయడం పూర్తికాలేదు. రంగులు వేశాక ఆ విగ్రహం మరింత అందంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో విగ్రహాన్ని కూడా కూడా ఇలా 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీన్ కాన్సెప్ట్ తోనే రూపొందించారు.
Also Read