'సీతా రామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్
on Aug 2, 2022
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతా రామం'. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రల్లో కనువిందు చేయనున్నారు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు(ఆగస్టు 3న) జరగనుంది. ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండటం విశేషం.
ప్రభాస్ ప్రస్తుతం 'అది పురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ k' వంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలకు సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ రావట్లేదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో 'సీతా రామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ పుణ్యమా అని తమ హీరోని చూసుకోవచ్చు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ సర్జరీ కోసం ఫారెన్ వెళ్లడంతో ఆయన రావడం కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవడంతో ఫ్యాన్స్ మళ్ళీ నిరాశ చెందారు. ఇప్పుడు వారిలో జోష్ నింపే న్యూస్ వచ్చింది. రేపు హైదరాబాద్ లో జరగనున్న 'సీతా రామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు.
కాగా, ప్రభాస్ 'ప్రాజెక్ట్ k' మూవీని కూడా వైజయంతి మూవీస్ సంస్థనే నిర్మిస్తోంది. మరి 'సీతా రామం' ఈవెంట్ లో 'ప్రాజెక్ట్ k' గురించి ప్రభాస్ ఏమైనా రివీల్ చేస్తాడేమో చూడాలి.
Also Read