అల్లుఅర్జున్ పై ఓజి విలన్ షాకింగ్ కామెంట్స్.. నెంబర్ వన్ హీరో ఆయనే
on Oct 16, 2025

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 24 క్రాఫ్ట్స్ పని తీరుతో పాటు నటీనటులు ప్రదర్శించిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇందుకు కారణమని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా పవన్ తో పాటు మిగతా నటీనటులు తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. అలాంటి నటుల్లో ముంబై(Mumbai) కి చెందిన 'సుదేవ్ నాయర్'(Sudev Nair)ఒకరు. జిమ్మీ అనే నెగిటివ్ రోల్ లో సుదేవ్ ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ ని ప్రదర్శించాడు. ఒక రకంగా చెప్పాలంటే జిమ్మీ చేసిన ఒక హత్య వల్లనే ఓజి కథ జరుగుతుంది.
రీసెంట్ గా సుదేవ్ నాయర్ 'తెలుగువన్'(Telugu One)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాకు అల్లు అర్జున్(Allu Arjun)అంటే చాలా ఇష్టం. ఆయనకి పెద్ద అభిమానిని. అసలు హీరో అంటే అల్లు అర్జున్ నే. ఆయనతో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాను. మంచు లక్ష్మి(Manchu lakshmi)గారు మలయాళంలో ఒక సినిమా షూట్ లో పాల్గొన్నపుడు అల్లు అర్జున్ అంటే ఇష్టం గురించి ఆమెకి చెప్పాను. వెంటనే అల్లుఅర్జున్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది. దాంతో అల్లు అర్జున్ నాకు ఫోన్ లో కెరీర్ కి సంబంధించి బెస్ట్ విషెస్ చెప్పారు. అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలని ఉంది. పర్సనల్ గా కూడా ఆయన్ని కలవాలని ఉందని తెలిపాడు. ఇప్పుడు ఈ మాటలు అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్ ని తెప్పిస్తున్నాయి.
మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన సుదేవ్ నాయర్ బాలీవుడ్ లో తెరకెక్కిన 'గులాబ్ జంగ్' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత కన్నడ, మలయాళ భాషల్లో సుమారు ఇరవై చిత్రాల వరకు చేసాడు. 2023 లో 'టైగర్ నాగేశ్వరరావు' తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి దేవర మొదటి భాగంలో కీలక పాత్రలో మెరిశాడు. ప్రస్తుతం యష్, గీతు మోహన్ దాస్ ల టాక్సిక్ లో చేస్తుండగా, పలు కొత్త చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



