300 కోట్ల క్లబ్ లో ఓజీ.. అయినా ఫ్యాన్స్ లో నిరాశ!
on Oct 6, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన 'ఓజీ' మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కేవలం 11 రోజుల్లోనే రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఈ సినిమా.. పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా, ఈ ఏడాది అత్యధిక వసూళ్ళు రాబట్టిన తెలుగు చిత్రంగానూ నిలిచింది. (They Call Him OG)
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన గ్యాంగ్ స్టర్ మూవీ 'ఓజీ'.. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.154 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే జోరుని కొనసాగిస్తూ ఫస్ట్ వీకెండ్ లో(నాలుగు రోజుల్లో) రూ.252 కోట్ల గ్రాస్ సాధించింది. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సరికి 11 రోజుల్లో రూ.308 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ మేరకు మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. (OG Collections)

పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా 'ఓజీ' నిలిచింది. 'ఓజీ'కి ముందు ఆయన కెరీర్ లో 200 కోట్ల గ్రాసర్ లేదు. అలాంటిది ఇప్పుడు 'ఓజీ'తో ఏకంగా 300 కోట్ల గ్రాసర్ వచ్చి చేరింది. మరి ఫుల్ రన్ లో ఈ మూవీ ఇంకెన్ని వసూళ్ళు రాబడుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే, అక్టోబర్ 2న విడుదలైన 'కాంతార చాప్టర్ 1' మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దాంతో ఓజీ జోరుకి కాస్త బ్రేక్ పడింది. లేదంటే బాక్సాఫీస్ దగ్గర ఓజీ మరిన్ని సంచలనాలు సృష్టించేదనే అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



