చరణ్ ఫస్ట్ లుక్ విడుదల
on Mar 26, 2014
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మార్చి 27న రాంచరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్ పంచెకట్టుతో మోడ్రన్ రైతులాగా అదరగొడుతున్నాడు. చరణ్ సరసన కాజల్ జతకట్టింది. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చరణ్ కు తండ్రి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
