సింగల్ స్క్రీన్ థియేటర్స్ కి కేంద్రం కానుక
on Sep 4, 2025

గత కొంత కాలంగా సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఒక్కొక్కటిగా మూతపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పలువురు థియేటర్(Theater)ఓనర్స్ మాట్లాడుతు టికెట్స్ పై వసూలు చేసే జిఎస్టి అధికభారంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తు వస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం(Central Government)జిఎస్టి(Gst)భారాన్ని తగ్గిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
సదరు ఉత్తర్వులు ప్రకారం వంద రూపాయిల టికెట్ రేట్ పై ఉన్న పన్నెండు శాతం జీఎస్టి ని ఐదు శాతంగా ఉండనుంది. దీంతో బి సి సెంటర్స్ లో ఉన్న అనేక థియేటర్స్ కి లబ్ది చేకూరనుంది. ఫలితంగా థియేటర్ల మూత వేత సమస్య కొంత వరకు తీరవచ్చని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. వంద రూపాయిల కంటే ఎక్కువ ధర ఉన్న మల్టిప్లెక్స్, ప్రీమియం థియేటర్స్ లో ఉన్న టికెట్ రేట్ కి యధావిధిగా 18 శాతం జి ఎస్టి యధావిధిగా కొనసాగనుంది.
థియేటర్స్ లో అమ్మే పాప్ కార్న్ విషయంలో సాల్ట్ పాప్ కార్న్ ఐదు శాతం స్లాబులోకి రాగా, క్యారమిల్ పాప్ కార్న్ పద్దెనిమిది శాతంలోకి వస్తుంది. గతంలో ఒకే పాప్ కార్న్ పై ప్యాకేజీ ని బట్టి వేరు వేరుగా పన్ను విధించేవారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



