నయన్ నయా కథ!
on Jun 23, 2015
.jpg)
సినిమాలతో కన్నా వివాదాలతో క్రేజ్ సంపాదించుకున్న నయన తారకు ఎదో ఒక హడావుడి చేయకపోతే పూటగడవదేమో. శింబు, ప్రభుదేవా అని కొన్నాళ్లు...ఆఫర్లు ఇచ్చిన దర్శకనిర్మాతలకు చుక్కలు చూపించి ఇంకొన్నాళ్లు రభస చేసింది. రీఎంట్రీలో కూడా కోట్లు డిమాండ్ చేస్తున్న భామ ఎవరైనా ఉన్నారంటే నయన అనే చెప్పాలి. పద్ధతి బాగాలేదమ్మా అని అడుగుదామంటే ఒంటికాలిమీద లేస్తుంది.
లేటెస్ట్ గా మీడియాను చూసి భామ వెనక్కు పారిపోతోందట. ఏం జరిగింద అని ఆరాతీస్తే.. మొన్నామధ్య కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తో సెల్ఫీ తీసుకుని పబ్లిక్ లోకి వదిలింది. దీంతో మరోకుర్రాడిని పట్టిందనే గుసగుసలు మొదలైపోయాయి. దీంతో మళ్లీ ప్రేమ-పెళ్లి అనే మాటలు చెప్పలేక...స్నేహితుడు అని కప్పిపుచ్చుకోలేక తెగ మథనపడుతోందట. అందుకే విఘ్నేష్ సంగతి మర్చిపోయేవరకూ మీడియాను తప్పించుకు తిరిగితే పోలా అని డిసైడైందట. అమ్మడి స్ట్రాటజీ ఏంటో తెలీదుకానీ మీడియాకు దూరంగా ఉంటా అంటూనే...మీడియాలో హడావుడి చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



