ఊహించని జోడీ వస్తోందా?
on Jun 25, 2015
.jpg)
స్క్రీన్ పై అప్పుడప్పుడు కొన్ని ఊహించని కాంబినేషన్స్ మెరుస్తుంటాయి. లేటెస్ట్ గా టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ ఒకటి రానున్నట్టు టాక్. ఇంతకీ ఎవరంటారా? నాని-కాజల్. మహేశ్ బాబుతో ఎక్కువ సినిమాలు తెరకెక్కించిన 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ తాజాగా నానితో ఓ మూవీ ప్లాన్ చేసుకుంది. హను రాఘవపూడి దర్శకుడు. ఈ చిత్రంలో కొద్దిమంది పిల్లలతో పాటూ కథానాయిక పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉందట. అందుకే కొత్త భామ కన్నా...కాస్త విషయం ఉన్న పిల్లని తీసుకుంటే బెస్టని డిసైడయ్యారట.
నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కాబట్టి కాజల్ అయితే సరిపోతుందనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఆరంభంలో కాజల్ అయితే క్యూట్ గా చందమామలా చల్లగా ఉంది. కానీ ఇప్పుడు అమ్మడు ముదిరిపోయింది కదా...కుర్రాడిలా కనిపించే నాని పక్కన సెట్టవుతుందంటారా? అనే డిస్కషన్స్ జోరందుకున్నాయి. నాని-కాజల్ జోడీ దమ్ములో ఎన్టీఆర్-త్రిష లా విమర్శలు ఎదుర్కొంటుందేమో అంటున్నారు. అయితే నటనలో ఇద్దరూ ఇద్దరే కాబట్టి లుక్ తో కాకుండా యాక్షన్ తో మెప్పిస్తారేమో మరి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



