ఖరీదైన కారు కొన్న తారక్.. ముందుగా చరణ్ ఇంటికే వెళ్ళాడు!
on Jul 23, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' మూవీతో వీరి ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది. తారక్, చరణ్ బాగా క్లోజ్ గా ఉంటున్నారు. గతంలో తారక్ పుట్టిన రోజుకు చరణ్ సతీ సమేతంగా తారక్ ఇంటికి వెళ్లి సెలబ్రేట్ చేశాడు. ఇక తాజాగా తారక్ తాను కొన్న ఖరీదైన కారులో ముందుగా చరణ్ ఇంటికే వెళ్ళినట్లు తెలుస్తోంది.
లాంబొర్కిని యూరస్ కారుని తారక్ కొన్ని నెలల క్రితం బుక్ చేయగా ఇటీవలే డెలివరీ అయ్యింది. ఈ కారు ఖరీదు రూ. 5 కోట్ల కు పైగా ఉంటుందట. ఈ కొత్తకారుతో తారక్ తాజాగా చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాడట. తారక్.. చరణ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పార్క్ చేసి ఉన్న ఆ కారు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
కాగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో తారక్, చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.