మిరాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ!
on Sep 11, 2025

'హనుమాన్'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తేజ సజ్జా(Teja Sajja).. ఇప్పుడు 'మిరాయ్'తో మ్యాజిక్ చేయబోతున్నాడు. కార్తీక్ ఘట్టమేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో మంచు మనోజ్ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్, భారీ అంచనాల నడుమ రేపు(సెప్టెంబర్ 12) విడుదలవుతోంది. అయితే కొన్ని చోట్ల ఈరోజు ప్రీమియర్లు వేస్తున్నారు. తాజాగా ముంబైలో స్పెషల్ ప్రీమియర్ వేయగా.. అద్భుతమైన స్పందన లభిస్తోంది. (Mirai)
రైటింగ్ పరంగా, విజువల్ పరంగా 'మిరాయ్' మూవీ అద్భుతంగా ఉందట. పురాణాలను, చరిత్రను, వర్తమానాన్ని కలుపుతూ రాసుకున్న ఈ మూవీ స్టోరీ మైండ్ బ్లోయింగ్ అని చెబుతున్నారు. స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకున్నారో.. దానిని తెరపైకి తీసుకొచ్చిన తీరు కూడా అంతే అద్భుతంగా ఉందని అంటున్నారు. ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉందట. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేశాయని మాట్లాడుకుంటున్నారు. సంపాతి ఎపిసోడ్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అని టాక్.
మొత్తానికి 'మిరాయ్' స్పెషల్ ప్రీమియర్ కి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే.. తేజ సజ్జా ఖాతాలో మరో భారీ పాన్ ఇండియా హిట్ పడినట్లే అని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



