లైఫ్ కామెడీ కాదు.. మెహరీన్
on Jan 27, 2020

లైఫ్ కామెడీ కాదంటోంది మెహరీన్. ఈ పంజాబీ భామ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా ‘అశ్వథ్థామ’. నాగశౌర హీరోగా నటించడంతో పాటు అతడే స్వయంగా కథ రాశాడు. జనవరి 31న సినిమా విడుదలవుతోంది. తన స్నేహితుడి చెల్లెలకు ముంబైలో ఎదురైన చేదు అనుభవం ఆధారంగా నాగశౌర్య ఈ సినిమా కథ రాశాడు. ఈ సినిమా గురించి మెహరీన్ మాట్లాడుతూ ‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కింది. చాలా ఫాస్ట్ పేస్‌లో సన్నివేశాలు సాగుతాయి. ఇందులో కామెడీ ఉండదు. ఉంటుందని ఎవరూ ఊహించవద్దు. లైఫ్ కామెడీ కాదు కదా... కామెడీగా తీయడానికి’’ అని చెప్పింది.
ఈ సినిమా కథ నాగశౌర్య రాసినా, అతడి ఓన్ ప్రొడక్షన్‌లో సినిమా తెరకెక్కినా దర్శకుడి పనిలో అతడు జోక్యం చేసుకోలేదని మెహరీన్ తెలిపింది. ‘‘నాకు కథ చెప్పింది దర్శకుడు రమణ తేజ. సెట్‌లో కూడా సన్నివేశాలు అతడే వివరించేవాడు. నాగశౌర్య అతడి పనిలో జోక్యం చేసుకోలేదు. కథ రాయడం వరకే నాగశౌర్య పని. అతడు మంచి కోస్టార్. అతడితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంది’’ అని మెహరీన్ చెప్పింది. సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ ‘‘ఇందులో నాగశౌర్య, నాకు మధ్య లవ్ ట్రాక్, సాంగ్స్ ఉన్నాయి. అలాగే, నా ఇంట్రడక్షన్ బాగుంటుంది. అలాగని, నా క్యారెక్టర్ సాంగ్స్, లవ్ సీన్స్‌కి పరిమితం కాలేదు. హీరో లక్ష్యసాధనలో అతడికి హెల్స్ చేసే అమ్మాయిగా కనిపిస్తా. సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది’’ అని మెహరీన్ పేర్కొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



