స్నేహితుల్ని పక్కన పెట్టేసిన లోకేష్ కనగరాజ్.. మరి కూలీ పరిస్థితి ఏంటి!
on Jul 7, 2025

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)కాంబోలో ఆగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న మూవీ 'కూలీ'(Coolie). ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున(Nagarjuna),అమీర్ ఖాన్(Aamir Khan)ఉపేంద్ర(Upendra) వంటి మేటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శృతి హాసన్(Shruthi Haasan)హీరోయిన్ గా చేస్తుండగా మరో హీరోయిన్ 'పూజాహెగ్డే'(Pooja Hegde)ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది.
రీసెంట్ గా దర్శకుడు 'లోకేష్ కనగరాజ్' ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు గత రెండు సంవత్సరాలుగా నాకు 'కూలీ' తప్ప మరో ధ్యాస లేదు. ఫ్యామిలీ,స్నేహితులు,సరదాలు అన్ని మానేసాను. నా ముప్పై ఆరు, ముప్పై ఏడు సంవత్సరాలకి సంబంధించిన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోలేదు. రజనీ సార్ సినిమా విషయంలో పరధాన్యంతో ఉండకూడదని, నెలల తరబడి సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాను. లియో మూవీని వేగంగా పూర్తి చెయ్యాలనే తొందరలో చాలా విషయాల గురించి పట్టించుకోలేదు.ఆ తప్పు కూలీ విషయంలో జరగదని లోకేష్ చెప్పుకొచ్చాడు
ఇళయ దళపతి విజయ్(Vijay)తండ్రి కొడుకులుగా చేసిన 'లియో' 2023 అక్టోబర్ 19 న వరల్డ్ వైడ్ గా విడుదలయ్యింది. లోకేష్ కనగరాజ్ నుంచి విక్రమ్ లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన లియో మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. దీంతో కూలీ మూవీని హిట్ చెయ్యాలనే పట్టుదలతో లోకేష్ కనగరాజ్ ఉన్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



