రవితేజ సినిమాలో లెజెండరీ యాక్టర్!
on Aug 2, 2022
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.
తాజాగా 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో కీలక పాత్ర కోసం జాతీయ అవార్డ్ గ్రహీత, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ను ఎంపిక చేశారు. ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ది కాశ్మీర్ ఫైల్స్' లో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చేరిక హిందీ మార్కెట్‌కు సహాయపడుతుంది.
'టైగర్ నాగేశ్వరరావు'ను అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పేరు మోసిన స్టువర్ట్‌పురం దొంగ 'టైగర్ నాగేశ్వరరావు' జీవిత కథ ఆధారంగా 1970 నేపథ్యంలో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా కోసం రవితేజ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. డిక్షన్, డైలాగ్ డెలవరీ, గెటప్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటూ, మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించబోతున్నారు రవితేజ.
ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆర్ మదీ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
