నేను చాలా సాఫ్ట్ అంటోన్న కాజల్!
on May 14, 2015
.jpg)
నేను చాలా సాఫ్ట్ అంటోంది కలువకళ్ల చిన్నది కాజల్. అవును నువ్వు సాఫ్టే అందుకే అందాల చందమామ అని ముద్దుగా పిలిచుకుంటున్నాం కదా అంటారా? అయితే ఆమె మాట్లాడుతున్నది స్కిన్ సాఫ్ట్ గురించి కాదు...మనసు సాఫ్ట్ గురించి. విషయమేంటంటే... హీరోయిన్స్ అంతా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. కానీ తానలా కాదంటోంది. తనకస్సలు విలన్ రోల్స్ సరిపడవట. అసలు ప్రేక్షకులు రీసీవ్ చేసుకోనే చేసుకోరని తేల్చి చెబుతోంది. హాయిగా నవ్వగలను...రొమాంటిక్ భావాలు పలికించగలను కానీ....క్రూరత్వాని ప్రదర్సించలేనంటోంది కాజల్. కెరీర్ క్లోజ్ అవుతున్న టైమ్ లో ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇందుకిస్తోందో అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే హీరోయిన్ ఆఫర్స్ ఎలాగూ తగ్గిపోయాయి. దీంతో ఇక రకరకాల ప్రాత్రల్లో నటించమని అడుగుతుంటారు. అందుకే ముందుజాగ్రత్తగా ఇలా చెప్పిందా? ఏదేమైనా తట్టాబుట్టా సర్దేసుకునే టైమ్ లో ఇలాంటి ఆంక్షలు పెడితే కష్టం సుమీ!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



