'మా' అధ్యక్ష బరిలో జీవితా రాజశేఖర్!!
on Jun 22, 2021
మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు రేసులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకరు రేసులోకి రానున్నట్లు తెలుస్తోంది. మా ప్రెసిడెంట్ రేసులో జీవితా రాజశేఖర్ నిలవబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం 'మా' కార్యదర్శిగా కొనసాగుతున్న జీవితా రాజశేఖర్.. మా ప్రెసిడెంట్ రేసులో నిలవబోతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. కాగా, మెగా ఫ్యామిలీ మద్దతుతో ప్రకాష్ రాజ్ బరిలో నిలుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే మంచు విష్ణుకు ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్న నరేష్ మద్దతు ఉందని తెలుస్తోంది. కృష్ణ, కృష్ణంరాజు వంటి సీనియర్ల మద్దతు కూడా కూడగడుతున్నారు. అయితే ఇప్పుడు జీవితా రాజశేఖర్ కూడా బరిలో ఉన్నారని వార్తలు వస్తుండటంతో.. ఆమెకి మద్దతుగా ఎవరెవరు ఉంటారనేది చర్చనీయాంశమైంది.
కాగా గత మా పానెల్ లో రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే అప్పుడు నరేష్ తో జీవిత, రాజశేఖర్ లకు విభేదాలు వచ్చాయి. ఆ టైంలో వీరు నరేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాజశేఖర్ తన వైస్ ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే జీవిత మాత్రం కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చారు. మరి ఈసారి 'మా' ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.
Also Read