కాజల్ స్థానంలో ఇలియానా!
on Sep 20, 2021
`గరుడవేగ` వంటి విజయవంతమైన చిత్రం తరువాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా `ఘోస్ట్`. కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం.. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. నాగ్ బర్త్ డే స్పెషల్ గా ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. అక్కినేని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో నాగ్ మాజీ `రా` ఏజెంట్ గా నటిస్తుండగా.. అతనికి జోడీగా కాజల్ అగర్వాల్ ఎంపికైంది. ఆమెది కూడా `రా` ఏజెంట్ పాత్రే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమా నుంచి కాజల్ తప్పుకుందట. ఆమె గర్భవతి కావడమే ఇందుకు కారణమని ఇన్ సైడ్ టాక్. ఈ నేపథ్యంలో.. మరో నాయిక పేరు ఈ ప్రాజెక్ట్ కోసం వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు.. ఒకటిన్నర దశాబ్దం క్రితం తెలుగునాట సంచలనం సృష్టించిన ఇలియానా. `అమర్ అక్బర్ ఆంటొని` తరువాత మళ్ళీ తెలుగు సినిమా చేయని ఇలియానాని.. ఈ చిత్రం కోసం ఎంచుకున్నారని వినికిడి. అదే గనుక నిజమైతే.. నాగ్ తో ఇలియానా నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే `ఘోస్ట్`లో ఇలియానా ఎంట్రీపై క్లారిటీ రానుంది.
మరి, నాగ్ - ఇలియానా ఫస్ట్ కాంబినేషన్.. సినిమాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
Also Read