మోహన్ బాబుని తొలగించి చిరంజీవిని తీసుకున్నాం
on Jan 21, 2025

దర్శకుడు 'కే.బాపయ్య'(k Bapayya)గురించి తెలియని సినీ ప్రేమికుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. దర్శకేంద్రుడు 'రాఘవేంద్రరావు'(k.Raghavendhrarao)సోదరుడు అయినటువంటి బాపయ్య సినీ ప్రస్థానం 1970 లో 'కృష్ణంరాజు' హీరోగా వచ్చిన 'ద్రోహి' అనే మూవీతో ప్రారంభమయ్యింది.ఆ తర్వాత 'ఎన్టీఆర్'(Ntr)తో ఎదురులేని మనిషి,యుగ పురుషుడు,సాహసవంతుడు,అగ్గిరవ్వ,నా దేశం వంటి సినిమాలతో పాటు కృష్ణ(Krishna),శోభన్ బాబు(Shoban babu),చిరంజీవి(Chiranjeevi)వంటి హీరోలతో కూడా హిట్ సినిమాలు తెరకెక్కించి సుదీర్ఘ కాలం పాటు అగ్ర దర్శకుడిగా కొనసాగారు.
రీసెంట్ గా బాపయ్య గారు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'చిరంజీవి'తో నేను 'ఇంటి గుట్టు' అనే సినిమాని తెరకెక్కించాను.నిజానికి ఆ సినిమాలో 'మోహన్ బాబు'(Mohan babu)హీరో.ఆయనతో కొంత భాగం కూడా చిత్రీకరణ జరిపాం.ఒకసారి సత్యనారాయణ గారితో ముఖ్యమైన సీన్స్ తెరకెక్కిస్తుంటే మోహన్ బాబు వచ్చాడు. విషయం చెప్పి వెయిట్ చెయ్యమని చెప్పాను.కానీ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు.దీంతో బిహేవియర్ సరిగా లేదని చిరంజీవి ని హీరోగా తీసుకున్నాం.ఆ తర్వాత ఆర్టిస్టులకి నచ్చ చెప్పుకొని మొదట నుంచి మళ్ళీ షూట్ చేశామని చెప్పుకొచ్చాడు.'ఇంటి గుట్టు' మూవీ 1984 లో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకోవంతో పాటుగా చిరంజీవి కి ఫ్యామిలీ హీరో గా మంచి గుర్తింపుని కూడా ఇచ్చింది.

బాపయ్య గారు హిందీలో కూడా సంజీవ్ కుమార్,రాజేష్ ఖన్నా,ధర్మేంద్ర,మిథున్ చక్రవర్తి, దిలీప్ కుమార్,జాకీ ష్రాఫ్ వంటి తదితర హీరోలతో సుమారు ఇరవై ఐదు చిత్రాలకి దాకా దర్శకత్వం వహించాడు.బాపయ్య గారి తండ్రి కే ఎస్ ప్రకాశరావు కూడా ప్రఖ్యాత దర్శకులే.అక్కినేని నాగేశ్వరరావు హిట్ మూవీ 'ప్రేమ్ నగర్' ప్రకాశరావు గారి దర్శకత్వంలో వచ్చిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



