చైతన్య రియాక్షన్ కి అర్థమేంటి?.. శోభితతో డేటింగ్ నిజమేనా!
on Aug 2, 2022
సమంతతో విడాకుల తర్వాత యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వార్తలపై స్పందించిన శోభిత అందులో వాస్తవం లేదని చెప్పింది. అయినప్పటికీ డేటింగ్ వార్తలకు మాత్రం బ్రేక్ పడలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో శోభిత పేరు చెప్తే చైతన్య ఇచ్చిన రియాక్షన్ డేటింగ్ వార్తలకు బలం చేకూర్చేలా ఉంది.
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించిన 'లాల్ సింగ్ చడ్డా'లో చైతన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధార్థ్ కన్నన్ అనే యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు చైతన్య. అందులో హోస్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహిస్తూ.. పర్సన్ పేరు చెప్పగానే మీ బ్రెయిన్ లో ఏం రన్ అవుతుందో చెప్పాలని అడిగాడు. విజయ్ దేవరకొండ అనగానే 'క్రేజీ', రాశిఖన్నా 'గ్రేట్ ఫ్రెండ్', కృతి శెట్టి 'బేబీ'(చిన్న పాప) అని చెప్పిన చైతన్య.. శోభిత పేరు వినగానే మాత్రం ఏం చెప్పకుండా మొదట నవ్వేశాడు. ఆ వెంటనే 'కేవలం నవ్వుతాను' అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే శోభిత పేరు చెప్పగానే చైతన్య సిగ్గుపడుతున్నట్లుగా స్మైల్ ఇవ్వడం చూస్తుంటే డేటింగ్ న్యూస్ నిజమే అనిపిస్తోంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి చైతన్య కేవలం డేటింగ్ రూమర్స్ గుర్తొచ్చి నవ్వాడో లేక ఆ నవ్వు వెనుక మరేదైనా కారణముందా అనేది త్వరలో క్లారిటీ వస్తుందేమో చూద్దాం.
Also Read