అప్పుడు ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు నారప్ప.. సైబరాబాద్ పోలీసుల క్రియేటివిటీ
on Jul 23, 2021
ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. సినిమా పోస్టర్స్ ను, ఫేమస్ డైలాగులను వాడేస్తూ సోషల్ మీడియాలో తమదైన స్టైల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తుంటారు. గతంలో ఆర్ఆర్ఆర్ పోస్టర్ ని ఎడిట్ చేసి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. పోస్టర్ లో బైక్ పై ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుండటంతో వారికి హెల్మెట్ అమర్చి.. ప్రజలకు హెల్మెట్ విలువ తెలిసేలా పోస్ట్ చేశారు.
ట్రాఫిక్ రూల్స్ పైనే కాకుండా.. కరోనాపై అవగాహన కూడా కల్పిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. కరోనాపై అవగాహన కోసం తాజాగా 'నారప్ప' సినిమాని వాడేసుకున్నారు. నారప్ప పోస్టర్ లోని వెంకటేష్ ముఖానికి మాస్క్ తగిలించి "ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప.. మాస్క్ పెట్టుకో సిన్నప్పా.. కరోనా ఇంకా ముగిసిపోలేదు" అంటూ మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా నారప్ప. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Also Read