హల్దీ వేడుకల్లో ఆలీ, జుబేదా హంగామా
on Nov 24, 2022
ఆలీ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు స్మాల్ స్క్రీన్ మీద ఇటు బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఆలీ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. ఆయన పెద్ద కూతురు ఫాతిమాకు త్వరలో పెళ్లి చేయబోతున్న నేపథ్యంలో ఇటీవల నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. ఇక ఇప్పుడు రీసెంట్ గా హల్దీ ఫంక్షన్ చేశారు. ఇందులో పెళ్లికూతురుకు తెలియకుండా పసుపు పూయాలన్నమాట.
ఇక ముందు ఆలీ జంట దువా చేసాక అందరికీ భోజనాలు పెట్టారు. తర్వాత వచ్చినవాళ్లందరికీ కొత్త బట్టలు పెట్టి హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేశారు . కూతురికి తెలియకుండా వెళ్లి ఆమె బట్టలకు పసుపు రాసేసింది జుబేదా. ఇక తర్వాత ఆ విషయం తెలిసి పెళ్లి కూతురు షాకయ్యింది. ఇక మిగతా చుట్టాలు కూడా ఒకరికొకరు అందరూ పసుపు పూసుకుని హంగామా చేశారు. డాన్సులు చేశారు. అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించుకున్నారు ఆలీ జంట. కూతురు పెళ్లి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు అలీ దంపతులు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తేదీ దగ్గర పడుతుండేసరికి ప్రముఖులను ఆహ్వానించే పనిలో పడ్డారు అలీ దంపతులు.
Also Read