దిమ్మతిరిగేలా 'డ్యూడ్' బిజినెస్.. దీపావళి విన్నర్ ఎవరు..?
on Oct 16, 2025

ఈ దీపావళికి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో మూడు తెలుగు సినిమాలు కాగా, ఒకటి తమిళ చిత్రం. నేడు(అక్టోబర్ 16) 'మిత్ర మండలి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్.. బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే. రేపు(అక్టోబర్ 17) 'తెలుసు కదా', 'డ్యూడ్' విడుదలవుతున్నాయి. అక్టోబర్ 18న 'కె-ర్యాంప్' రిలీజ్ అవుతోంది. అయితే ఈ నాలుగు సినిమాల థియేట్రికల్ బిజినెస్ ని గమనిస్తే.. మిగతా మూడు సినిమాల బిజినెస్ కి దాదాపు రెట్టింపు బిజినెస్ 'డ్యూడ్' చేయడం విశేషం.
ఈ దీపావళి సినిమాల్లో అత్యధిక బిజినెస్ 'డ్యూడ్' చేయగా, 'మిత్ర మండలి' తక్కువ బిజినెస్ చేసింది. 'మిత్ర మండలి' మూవీ హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే కనీసం రూ.5.5 కోట్ల షేర్ రాబట్టాలని తెలుస్తోంది. ప్రస్తుత టాక్ ని బట్టి చూస్తే.. ఆ మొత్తం రాబట్టడం కష్టమే. అలాగే, 'కె-ర్యాంప్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11.5 కోట్ల షేర్ కాగా, 'తెలుసు కదా' టార్గెట్ రూ.23 కోట్లని సమాచారం. ఇక 'డ్యూడ్' బ్రేక్ టార్గెట్ ఏకంగా రూ.60 కోట్ల షేర్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
'మిత్ర మండలి', 'కె-ర్యాంప్', 'తెలుసు కదా' మూడు సినిమాలకు కలిపి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.40 కోట్ల షేర్ అయితే.. ఒక్క 'డ్యూడ్' మూవీ టార్గెట్ రూ.60 కోట్లు కావడం విశేషం. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ గత రెండు చిత్రాలు 'లవ్ టుడే', 'డ్రాగన్' ఘన విజయం సాధించాయి. అందుకే ఇప్పుడు 'డ్యూడ్'కి ఈ రేంజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. మరి ఈ దీపావళి సినిమాల్లో ఏది విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



