బిందు కోరిక నెరవేరుతుందా?
on Jun 23, 2015

తాప్సీ తనకు ఆదర్శం అంటోందట ఆవకాయ్ బిర్యాని భామ బిందుమాధవి. తాప్సీ అంతగొప్ప పనేం చేసిందో? ఆమెను ఆదర్శంగా తీసుకోవడానికి అని కోలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారట. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటినుంచి ఐరెన్ లెగ్గుగా మైనస్ మార్కులేయించుకున్న తాప్సీ... గంగంతో ఓ రేంజ్ కెళ్లిపోయింది.
ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉందని....లేటెస్ట్ మూవీ జాక్సన్ దురైతో తన కెరీర్ ఓ రేంజ్ కెళ్లిపోతుందని తెలుగమ్మాయి నమ్మకంగా ఉందట. ఆవకాయ్ బిర్యానీలో బిందుని చూసి బాగుందనిపించినా....అమ్మడికి ఆఫర్లు దక్కలేదు. దీంతో కోలీవుడ్ కి చెక్కేసింది. అడపా దడపా ఛాన్సులు సొంతంచేసుకుంటోందే కానీ ఇప్పటి వరకూ బ్రేక్ రాలేదు. శిబిరాజ్ తో కలసి నటిస్తోన్న జాక్సన్ దురై తన ఫేట్ మారుస్తుందని నమ్మకంగా ఉంది. మరి ఆవకాయ్ పిల్ల కోరిక నెరవేరుతుందంటారా?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



