'SSMB 29' నుంచి బిగ్ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే పోస్టర్!
on Aug 9, 2025

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'SSMB29' అనేది వర్కింగ్ టైటిల్. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఇందులో మహేష్ లుక్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారికొక బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది.
నేడు(ఆగస్టు 9) మహేష్ బాబు పుట్టినరోజు. హీరోల పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ వంటివి రావడం సహజం. అయితే మహేష్ బర్త్ డేకి 'SSMB29' నుంచి ఎటువంటి అప్డేట్ ఉండదని కొద్దిరోజుల నుంచి వార్తలొచ్చాయి. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఇలాంటి సమయంలో 'SSMB29' టీం ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది.
'SSMB29' నుంచి ప్రీ లుక్ పోస్టర్ విడుదలైంది. కథానాయకుడు శివ భక్తుడని సూచించేలా మెడలో త్రిశూల రుద్రాక్ష మాల ధరించినట్టు చూపించారు. అలాగే శరీరంపై నెత్తుటి దార కనిపిస్తోంది. వస్త్రధారణ కూడా విభిన్నంగా ఉంది. మొత్తానికి మహేష్ ని రాజమౌళి అత్యంత శక్తివంతంగా, మునుపెన్నడూ చూడని అవతార్ లో చూపించబోతున్నాడని ఈ పోస్టర్ తో అర్థమవుతోంది. అలాగే ఈ మూవీ ఫస్ట్ లుక్ ని నవంబర్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
'SSMB29' ప్రీ లుక్కే ఈ రేంజ్ లో ఉందంటే.. ఇక ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



