'భీమ్లా నాయక్' నుంచి 'అంత ఇష్టం' సాంగ్ ప్రోమో.. తమన్ మ్యాజిక్ రిపీట్!
on Oct 14, 2021
పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ జోడీగా నిత్యా మీనన్, రానా జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి 'అంత ఇష్టం' అనే సాంగ్ ప్రోమో విడుదలైంది.
పవన్ పుట్టిన రోజు(సెప్టెంబర్ 2) కానుకగా 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక దసరా కానుకగా రేపు(అక్టోబర్ 15న) 'అంత ఇష్టం' అనే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 'అంత ఇష్టమేందయ్యా నీకు' అంటూ పవన్, నిత్యా మధ్య సాగుతున్న ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను కేఎస్ చిత్ర ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.
'అంత ఇష్టం' సాంగ్ అక్టోబర్ 15న ఉదయం 10:19 కి విడుదల కానుంది. మరి 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ తో సంచలనం సృష్టించిన తమన్.. చిత్ర, రామజోగయ్య శాస్త్రిలతో కలిసి 'అంత ఇష్టం' సాంగ్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.