శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే! మెయిన్ రీజన్ ఇదే
on Jun 26, 2025
అఖిల్ అక్కినేని(Akhil Akkineni)నుంచి సినిమా వచ్చి రెండేళ్లు పైనే అవుతుంది. 2023 ఏప్రిల్ లో 'ఏజెంట్' తో వచ్చి అభిమానులతో పాటు ప్రేక్షకులని నిరాశపరిచాడు. దీంతో అప్ కమింగ్ మూవీ 'లెనిన్'(Lenin)పైనే అందరి ఆశలు ఉన్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'లెనిన్' కి సంబంధించి, ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు అంచనాలు పెంచాయని చెప్పవచ్చు. అఖిల్ ఫస్ట్ టైం మాస్ రగడ్ లుక్ లో కనిపిస్తుండటం, చిత్తూరు యాసలో కథ తెరకెక్కుతుండటంతో, లెనిన్ హిట్ ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
ఈ మూవీలో హీరోయిన్ గా 'శ్రీలీల'(Sreeleela)ని మేకర్స్ ఎంపిక చేసారు. ఆమెపై కొంత భాగం షూటింగ్ ని చిత్రీకరించడం జరిగింది. అఖిల్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8 న రిలీజైన టీజర్ లో కూడా శ్రీలీలని చూపించారు. కానీ ఇప్పుడు శ్రీలీల ప్లేస్ లో 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse)ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. శ్రీలీల ప్రస్తుతం హిందీలో 'కార్తీక్ ఆర్యన్' తో కలిసి 'ఆషీకీ 3 ' లో చేస్తుంది. దీంతో పాటు పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్, జూనియర్ అనే సినిమాలు చేస్తుంది. వీటితో పాటు హిందీలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రాలన్నీ షూట్ దశలో ఉండటంతో, లెనిన్ కి శ్రీలీల డేట్ అడ్జస్ మెంట్ సెట్ అవ్వటం లేదని, అందుకే లెనిన్ కి ఇబ్బంది కలగకుండా శ్రీలీల కి బదులుగా భాగ్యశ్రీ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్.
మిస్టర్ బచ్చన్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ప్రస్తుతం 'రామ్ పోతినేని'(Ram Pothineni)తో ఆంధ్రా కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)తో కాంత, విజయ్ దేవర కొండ(Vijay Devarakonda)అప్ కమింగ్ మూవీ 'కింగ్ డమ్' లో చేస్తుంది. దీంతో లెనిన్ మూవీలో అవకాశం ఆమెకి బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. లెనిన్ ని అన్నపూర్ణ స్టూడియో, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినరోభాగ్యము విష్ణు కథ చిత్రం ఫేమ్ 'మురళి కిషోర్ అబ్బూరి'(Murali Kishor Abburi) దర్శకుడు. ఈ సంవత్సరమే వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో లెనిన్ అడుగుపెట్టనుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
