బెల్లంకొండ.. 'స్వాతిముత్యం' అయ్యాడు..!
on Sep 14, 2021
టాలీవుడ్ కు మరో వారసుడు హీరో గా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు 'బెల్లంకొండ గణేష్'ను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ హీరోగా వెండితెరకు పరిచయం చేస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు.
ఈరోజు(సెప్టెంబర్ 14) బెల్లంకొండ గణేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి 'స్వాతిముత్యం' అనే పేరును నిర్ణయించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ సింపుల్ గా ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో హీరో గణేష్ భుజాన బ్యాగ్ తో ఉండటం కనిపిస్తుంది. పోస్టర్ ని బట్టి చూస్తే హీరో ఆఫీస్ లో ఎంప్లాయ్ అని అర్థమవుతుంది.
'స్వాతిముత్యం'లో గణేష్ కి జోడీగా 'వర్ష బొల్లమ్మ' నటిస్తోంది. సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రమని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.
Also Read