ఓటీటీలోకి 'అంటే సుందరానికీ'
on Jul 3, 2022
నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన 'అంటే సుందరానికీ' నెలరోజులకే ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికీ జూన్ 10న విడుదలై పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా నాని కామెడీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. జులై 10 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వివేకా సాగర్ సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మి, ఎడిటర్ గా రవితేజ గిరజాల వర్క్ చేశారు.