తారక్, చరణ్.. ఇద్దరికీ అతనేనా?
on Jun 22, 2021
పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`లో కలిసి నటిస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా తరువాత తారక్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో `NTR 30` చేయనుండగా.. ఏస్ కెప్టెన్ శంకర్ కాంబినేషన్ లో `#RC 15` చేయబోతున్నాడు చరణ్. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా వచ్చే ఏడాది థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
ఇదిలా ఉంటే.. `ఆర్ ఆర్ ఆర్` తరువాత తారక్, చరణ్ నుంచి రాబోయే ఈ కొత్త చిత్రాలకు సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉందట. అదేమిటంటే.. రెండు సినిమాలకూ ఒకరే సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడట. ఇంతకీ ఆ స్వరకర్త ఎవరంటే.. కోలీవుడ్ లో తన బాణీలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అనిరుధ్. ఇప్పటికే ఈ మేరకు ఆయా చిత్రాల యూనిట్స్.. అనిరుధ్ తో సంప్రదింపులు జరిపాయని సమాచారం. ఈ రెండు సినిమాలు కూడా పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో అనిరుధ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బజ్. త్వరలోనే `NTR 30`, `#RC 15`లో అనిరుధ్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. ఈ భారీ బడ్జెట్ మూవీస్ కి అనిరుధ్ స్వరాలు ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.