అల్లు స్నేహ సరికొత్త రికార్డ్.. ఏ స్టార్ హీరో వైఫ్ కి లేనంత క్రేజ్
on Jun 17, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి.. ఇన్స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్ లో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోవర్స్ ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. తాజాగా ఆమె 4 మిలియన్ ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డు సృష్టించారు.
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్నేహ ఇన్స్టాగ్రామ్ లో 4 మిలియన్ మార్క్ ని అందుకోవడం విశేషం. తన పిల్లలు అయాన్, అర్హలకు చెందిన స్వీట్ మూమెంట్స్ తో పాటు.. తనకు ఆసక్తిగా అనిపించే వివిధ రంగాలకు సంబంధించిన పోస్ట్ లను స్నేహా షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవల తన భర్త బన్నీ ఆరుబయట మంచం మీద పిల్లలతో సరదాగా గడుపుతున్న వీడియోను స్నేహ షేర్ చేయగా బాగా వైరల్ అయింది.
ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం పూర్తయిన తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' చేయనున్నాడు.
Also Read