'గని' సెట్స్ లో మెరిసిన బన్నీ
on Jul 23, 2021
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు వెంకటేష్(బాబీ), సిద్ధూ ముద్దా సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెరిశాడు.
బన్నీ సోదరుడు బాబీ 'గని'తో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెట్ ను సందర్శించిన బన్నీ.. నిర్మాతగా తన అన్నయ్యకు సక్సెస్ రావాలని కోరుకున్నాడు. బన్నీ సెట్స్ కి రావడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది. షూటింగు విశేషాలను గురించి బాబీ, బన్నీ మాట్లాడుకున్నారు. షూటింగు జరుగుతున్న తీరును పరిశీలించిన బన్నీ.. టీమ్ ను అభినందించాడు. బన్నీ గాని సెట్స్ కి వచ్చిన విషయాన్ని బాబీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అలాగే సెట్స్ లో బన్నీ ఉన్న పిక్ ని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం కానుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, కన్నడ నటుడు ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
Also Read