రూ. 145 కోట్లకు లక్ష్మీ బాంబ్
on May 30, 2020

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లక్ష్మీ బాంబ్ సినిమా ఓటీటీలో విడుదల కావడం ఖాయమే. నిన్న మొన్నటి వరకు సినిమా నెట్టింటికి వస్తుందా? లేదా? అనే సందేహాలు ఉండేవి. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సంఘాలు నుండి వ్యతిరేకత రావడంతో కొన్ని అనుమానాలు ఉండేవి. ఇప్పుడు అటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జూన్ నెలలో ఓటీటీలో విడుదల అవుతుంది. స్టార్ డిస్నీ ఛానల్, లక్ష్మీ బాంబ్ నిర్మాతల మధ్య డీల్ సెట్ అయింది. ఇటీవల 145 కోట్ల రూపాయలకు డీల్ క్లోజ్ అయింది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
ఇప్పుడు అక్షయ్ కుమార్ మిగతా సినిమాలపై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది ఆసక్తికరం. ఎందుకంటే... అక్షయ్ నటించిన భారీ బడ్జెట్ సినిమా సూర్యవంశీ ఇంకా విడుదల కాలేదు. థియేటర్లు ఓపెన్ అయితే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ల సహకారం లేకపోతే కష్టమవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



