తమిళ నటుడు అజిత్ కీలక నిర్ణయం..షాక్ లో ఫ్యాన్స్
on Jan 11, 2025
తమిళ అగ్ర హీరో అజిత్ ప్రొఫెషనల్ రేసర్ అనే విషయం తెలిసిందే. పలు రేసింగ్ ఛాంపియన్ షిప్స్ లో ఆయన పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే జనవరి 11, 12 తేదీల్లో జరగనున్న 24H Dubai 2025 కోసం సన్నద్ధమవుతున్నారు.రీసెంట్ గా ఈ రేసింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ నడుపుతున్న రేసింగ్ కారు ప్రమాదానికి గురైంది.కారు వేగంగా వెళ్లి సైడ్ వాల్ కి ఢీ కొట్టింది.గోడను ఢీ కొనడంతో ట్రాక్ పై కారు గిర్రున తిరిగింది. అయితే ఈ ప్రమాదంలో అజిత్ గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక అజిత్ దుబాయ్ కార్ రేస్ నుంచి వైదొలుగుతునట్టుగా ఒక ప్రకటన జారీ చేసాడు.కాకపోతే రేస్ లో తన టీమ్ పాల్గొంటుందని తెలియచేసాడు.నేటి నుంచి దుబాయ్‌లో జరగనున్న కార్ రేస్ జరగనుంది.అజిత్ సినిమాల విషయానికి వస్తే 'విడా మయుర్చి' మూవీ చేస్తున్నాడు.ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ సంక్రాంతి నుంచి ఏప్రిల్ నెలకి వాయిదా పడింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
