'మా' అధ్యక్ష బరిలో హేమ.. సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి!!
on Jun 23, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ ఉండగా.. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష పదవి కోసం తాను బరిలోకి దిగుతున్నట్టు సీనియర్ నటి హేమ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా మా ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా అనేక పదవులు చేపట్టానని చెప్పారు. ఈసారి ట్రెజరర్ పదవికి పోటీ చేయాలనుకున్నానని.. కానీ ఆ ఆలోచనను మార్చుకున్నానని తెలిపారు.
ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత పెద్దలు ఎన్నికల బరిలో దిగుతున్నారని తెలిసాక.. పోటీ చేయకూడదని భావించానని తెలిపారు. అయితే, సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి వస్తోందని.. నువ్వెందుకు పోటీ చేయకూడదని ఫోన్లు చేసి అడుగుతున్నారని చెప్పారు. నువ్వుంటే బాగుంటుందని.. ఎవరైనా కష్టాలు చెప్పుకోవాలన్నా, అర్థ రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావని చెపుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు తనకు అండగా నిలిచిన వారందరి కోసం.. ఈసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని హేమ తెలిపారు.
Also Read