'పీకే' పెంచేసాడు..!
on Oct 25, 2014

అమీర్‌ఖాన్ 'పీకే' టీజర్ బయటకొచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు తో చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన అమీర్, తాజా టీజర్ తో అంచనాలను రెట్టింపు చేశాడు. సినిమాలోవున్న అమీర్ గెటప్స్ అన్నింటినీ టీజర్ లో చూపించారు. టీజర్ లో అమీర్‌ఖాన్ గెటప్‌లు, హావభావాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. మొత్తమ్మీద, 'పీకే' అమీర్ కెరీర్ లో మరో ప్రయోగాత్మక చిత్రమని టీజర్ చూసి చెప్పొచ్చు. అమీర్ కు '3 ఇడియట్స్' బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకుడు. అమీర్ తో అనుష్క శర్మ జోడిగా కట్టింది. డిసెంబర్ 19 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



