2022 లోగా మార్వెల్ నుంచి వస్తున్న మార్వలెస్ మూవీస్ ఇవే!
on Mar 6, 2021
మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. అవి ఇచ్చే సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అలాంటిది! అయితే ఓ దశాబ్దం తర్వాత మార్వెల్ నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాని సంవత్సరంగా 2020 నిలిచింది. కారణం తెలిసిందే.. కరోనా మహమ్మారి కారణంగా మిగతా ప్రొడక్షన్ హౌస్‌ల మాదిరిగానే మార్వెల్ షెడ్యూల్స్ అన్నీ దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో బ్లాక్ విడోతో ప్రారంభించి, ఒక్కో సినిమాని విడుదల చేయడానికి మార్వెల్ స్టూడియోస్ రంగం సిద్ధం చేస్తోంది. 2022 వరకు ఆ స్టూడియోస్ నుంచి వస్తున్న సినిమాలేవో ఓ లుక్ వేద్దామా?
1. బ్లాక్ విడో
రిలీజ్ డేట్: 7 మే 2021
తారాగణం: స్కార్లెట్ జొహాన్సన్, ఫ్లోరెన్స్ పుఫ్, రాబర్ట్ డౌనీ జూనియర్, రాచెల్ వీజ్, డేవిడ్ హార్బర్
డైరెక్టర్: కేట్ షార్ట్‌ల్యాండ్
2. షాంగ్-చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్
రిలీజ్ డేట్: 9 జూలై 2021
తారాగణం: సిము ల్యూ, ఆక్వాఫినా, ఫ్లోరియన్ ముంటియాను, టోనీ ల్యూంగ్, ఫలా చెన్
డైరెక్టర్: డెస్టిన్ డానియెల్ క్రెట్టన్
3. ఎటర్నల్స్
రిలీజ్ డేట్: 5 నవంబర్ 2021
తారాగణం: కిట్ హానింగ్టన్, రిచర్డ్ మాడెన్, ఏంజెలీనా జోలీ, కుమైల్ నంజియాని, మా డాంగ్-సియోక్
డైరెక్టర్: క్లో-ఝావో
4. స్పైడర్-మ్యాన్: నో వే హోమ్
రిలీజ్ డేట్: 17 డిసెంబర్ 2021
తారాగణం: టామ్ హాలండ్, జెందాయ, ఆల్ఫ్రెడ్ మోలినా, జేమీ ఫాక్స్, జాకబ్ బాటలాన్
డైరెక్టర్: జోన్ వాట్స్
5. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్
రిలీజ్ డేట్: 25 మార్చి 2022
తారాగణం: బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, ఎలిజిబెత్ ఓల్సెన్, రాచెల్ మెక్ఆడమ్స్, టామ్ హిడెల్‌స్టన్, సామ్ రైమి
డైరెక్టర్: సామ్ రైమి
6. థోర్: లవ్ అండ్ థండర్
రిలీజ్ డేట్: 6 మే 2022
తారాగణం: క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్టియన్ బేల్, నటాలీ పోర్ట్మన్, తైకా వైటిటి, టెస్సా థామ్సన్
డైరెక్టర్: తైకా వైటిటి
7. బ్లాక్ పాంథర్ 2
రిలీజ్ డేట్: 8 జూలై 2022
తారాగణం: లెటీషియా రైట్, మైఖేల్ బి. జోర్డాన్, టెనోక్ హుయెర్టా, విన్స్టన్ డ్యూక్
డైరెక్టర్: ర్యాన్ కూగ్లర్
8. డెడ్‌పూల్ 3
రిలీజ్ డేట్: 7 అక్టోబర్ 2022 (అంచనా)
తారాగణం: ర్యాన్ రేనాల్డ్స్
డైరెక్టర్: డేవిడ్ లీచ్
9. కెప్టెన్ మార్వెల్ 2
రిలీజ్ డేట్: 11 నవంబర్ 2022
తారాగణం: బ్రీ లార్సన్
డైరెక్టర్: నియా డకోస్టా