
రాకింగ్ స్టార్ యష్(Yash)అభిమానులు, మూవీ లవర్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్న మూవీ టాక్సిక్.. ఏప్రిల్ 10 న రిలీజ్ కావాల్సిన మూవీ.. మరి ఎవరి దిష్టి తగిలిందో గాని మార్చి 19 అన్నారు. ఆ డేట్ కూడా మారి జూన్ 4 కి వాయిదాపడింది.అది కూడా లేదు. దీంతో యష్ ఫ్యాన్స్ , మూవీ ఫ్యాన్స్ బాధకి అంతే లేకుండా పోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో అని ఒకటే వేదన.
తాజాగా కన్నడ సీమ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, 'టాక్సిక్' చిత్ర డిజిటల్ రైట్స్ (OTT Rights) కోసం నిర్మాతలు ఆశిస్తున్న రేటుకి , ప్రముఖ ఓటీటీ సంస్థలు కోట్ చేస్తున్న అమౌంట్‌కి సింక్ కుదరడం లేదు. మేకర్స్ అడుగుతున్న భారీ బడ్జెట్ రేట్లలో ఓటీటీ కంపెనీలు కేవలం 30 నుండి 40 శాతమే ఆఫర్ చేస్తున్నాయట. సాధారణంగా ఇలాంటి క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్టులకు షూటింగ్ దశలోనే వందల కోట్ల ఓటీటీ డీల్స్ క్లోజ్ అవుతాయి. కానీ 'టాక్సిక్' విషయంలో ఈ డిజిటల్ బిజినెస్ డీల్స్ ఇంకా తేలక పోవడంతోనే రిలీజ్ డేట్‌ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఓటీటీ టెన్షన్ ఇంకా సాల్వ్ కాకపోవడం వల్లే ప్రమోషన్స్ కూడా ముందుకు సాగడం లేదు.
మరోవైపు, సినిమా వాయిదా పడటంపై యష్ క్లారిటీ ఇస్తూ, లాస్ వేగాస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'సినిమాకాన్' (CinemaCon) ఈవెంట్‌లో 'టాక్సిక్' గ్లింప్స్‌కు అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ సినిమా గ్లోబల్ వేదికపై ఎదుగుతున్న తరుణంలో, సినిమాని మరింత విస్తృతంగా, సరైన అంతర్జాతీయ భాగస్వామ్యాలతో భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
Also read: Dhanush: ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు.. తెలుగు డైరెక్టర్‌కి హీరో ధనుష్ రిక్వెస్ట్!
ప్రస్తుతానికి సినిమా అవుట్ పుట్ కంప్లీట్ అయిందని, ఎలాంటి మేజర్ రీషూట్స్ జరగడం లేదని మేకర్స్ పుకార్లను కొట్టిపారేశారు. నిజానికి జూన్ రిలీజ్ పక్కా అనుకుని హీరో యష్ గత ఏప్రిల్‌లోనే నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు . కానీ ఈ బిజినెస్ మరియు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు పబ్లిసిటీని పూర్తిగా పక్కనబెట్టి, డైరెక్టర్‌తో కలిసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు. ఒకవేళ రాబోయే ఆగస్టు లేదా దసరా సీజన్ నాటికైనా ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యి 'టాక్సిక్' థియేటర్లలోకి రాకపోతే.. ఈ ప్రాజెక్ట్ ఏకంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.





